- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారానికోసారైనా స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్! ఎన్ని లాభాలో తెలుసా..?
మొబైల్ ఫోన్ వాడకం ఎంత సాధారణమో.. హ్యాకింగ్ కూడా అంతే సర్వసాధారణమైంది. ఒక్క క్లిక్ తో బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తున్నారు నేరగాళ్లు.

దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్ వాడకం ఎంత సాధారణమో.. హ్యాకింగ్ కూడా అంతే సర్వసాధారణమైంది. ఒక్క క్లిక్ తో బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తున్నారు నేరగాళ్లు. అయితే అలాంటి దోపిడీ నుంచి కాపాడుకునేందుకు మొబైల్ ఫోన్ తరుచుగా స్విచ్ ఆఫ్ చేయడం హెల్ప్ అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఎన్ని రోజులకోసారి చేయాలి? కలిగే బెనిఫిట్స్ ఏంటి? చూద్దాం.
స్మార్ట్ ఫోన్ తరుచుగా ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ ఆదా చేయొచ్చనే విషయం తెలిసిందే. కానీ డివైజ్ సెక్యూరిటీకి కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎప్పుడూ వెంటే ఉండే ఈ పరికరాలకు స్క్రీన్ గార్డ్, కవర్స్‌తో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇస్తాం కానీ హ్యాక్‌ల నుంచి రక్షించేందుకు మరింత అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఫోన్ పూర్తిగా ఆఫ్ చేయడం. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతి మాత్రమే కొన్ని హ్యాకింగ్ దాడుల నుంచి పరికరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. హానికరమైన లింక్‌ల ద్వారా స్మార్ట్ఫోన్లను యాక్సెస్ చేయడం ఇప్పుడు సర్వసాధారణం. కానీ జీరో-క్లిక్ ద్వారా కూడా ముంచేస్తున్నారు హ్యాకర్స్.
దీనిలో స్మార్ట్‌ఫోన్ భద్రతా లక్షణాలను దశలవారీగా దాటవేయడం ఉంటుంది. మిస్డ్ కాల్‌తో ప్రారంభించి.. ఆపై మొదట ఇన్స్టాల్ చేయబడిన ఫైల్స్.. క్రమంగా సిస్టమ్‌కు యాక్సెస్‌ను అనుమతిస్తాయి. తద్వారా హ్యాకర్లు మీ సమాచారాన్ని ట్యాప్ చేయవచ్చు. నిజానికి జీరో-క్లిక్ ఎక్స్‌ప్లాయిట్స్ సాధారణంగా గుర్తించబడవు. కానీ పరికరాన్ని పూర్తిగా రీబూట్ చేయడం ద్వారా నిరోధించవచ్చు. కనీసం వారానికి ఒకసారి ఇలా చేస్తే భద్రతా ప్రమాదాన్ని తొలగించడంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ సజావుగా వర్క్ చేస్తుంది. ఇక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఎంతసేపు ఉందో చూడటానికి.. సిస్టమ్ సెట్టింగ్స్‌లో ఉన్న సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు. Android పరికరాల్లో ఇది సాధారణంగా ‘డివైజ్’, ‘స్టేటస్’ కింద ఉంటుంది.
READ MORE ...
Oxygen box : ఇదో అద్భుతం.. అందులో పడుకుంటే పోయే ప్రాణం కూడా ఆగిపోతుంది!






