- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఫోన్ 16ప్రో మాక్స్ పై భారీ డిస్కౌంట్..ఇలా కొనుగోలు చేయండి
ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విజయ్ సేల్స్ స్టోర్స్, ఈకామర్స్ వెబ్ సైట్లో ఈ ఫోన్పై ఏకంగా రూ.13,500 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విజయ్ సేల్స్ స్టోర్స్, ఈకామర్స్ వెబ్ సైట్లో ఈ ఫోన్పై ఏకంగా రూ.13,500 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండనుంది. ఐఫోన్ 16 ప్రో రూ.1,44,900ల ప్రారంభ ధరతో ఇండియాలో లాంఛ్ అయ్యింది. కాగా ప్రస్తుతం ఈ ఫోన్ పై విజయ్ సేల్స్ రూ.9వేల డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 1,35,900గా ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్నవారికి రూ.4,500 డిస్కౌంట్ అధనంగా లభిస్తుంది. దీంతో ఐఫోన్ 16ప్రో మాక్స్ రూ.13,500 భారీ డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు.
దీంతో పాటు ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ఉన్న ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. 6.9 ఇంచుల భారీ డిస్ప్లేతో సూపర్ రేటినా XDR OLEDతో వస్తోంది. అంతే కాకుండా 3nm A18 Pro chipset ఈ ఫోన్లో ఉంది. ఏఐకి సైతం ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అందుబాటులో ఉంది. 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ ఉంది. దీంతో పాటూ ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సల్తో ఉంది. తక్కవ ధరలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ తీసుకోవాలనుకునేవారు ఇలా ప్రయత్నించడం బెటర్.






