- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన Google Pixel 9A ధర... ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భారీ ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయ్యాయి. ఈ సేల్ సందర్భంగా అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై భారీగా డిస్కౌంట్ విధించారు. ఈ నేపథ్యంలోనే Google Pixel 9a ఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయ్యాయి. ఈ సేల్ సందర్భంగా అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై భారీగా డిస్కౌంట్ విధించారు. ఈ నేపథ్యంలోనే Google Pixel 9a ఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. Google Pixel 9a 8GB RAM, 256 ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా ప్రస్తుతం దీనిపై ఫ్లిప్ కార్ట్ లో రూ.5వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ధర రూ.44,999లకు తగ్గింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్ట్ హెల్డర్లు ఈ ఫోన్ పై మరో రూ.5000 అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
దీంతో ఫోన్ కేవలం రూ.34,999కే వస్తుంది. అంటే మొత్తంగా Google Pixel 9a పై రూ.10వేలు తగ్గింది. ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 15.96 cm పొడవు ఉండగా 6.285 ఇంచుల Full HD డిస్ ప్లే ఉంది. ఇందులో 48MP + 12MP రేర్ కెమెరా ఉండగా 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh ఉండటం విశేషం. 23W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సైతం ఉండటంతో త్వరగా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇది Tensor G4 Processorతో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి ఉండగా కఠినమైన గేమ్స్ ఆడేందుకు, మల్టీ టాస్కింగ్ ను సైతం సులువుగా చేసేయవచ్చు.






