I PHONE 17పై బంపరాఫర్.. ఇక్కడ కోనుగోలు చేస్తే రూ.5వేల కంటే ఎక్కువ డిస్కౌంట్

by Ajay Maddhiboyina |

ఇటీవలే మార్కెట్‌లోకి ఐ ఫోన్ 17 విడుదలైన సంగతి తెలిసిందే. ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ కావడంతో కొనుగోలు చేసేందుకు ఆపిల్ లవర్స్ ఎగబడుతున్నారు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.82,900 కాగా ప్రస్తుతం దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

I PHONE 17పై బంపరాఫర్.. ఇక్కడ కోనుగోలు చేస్తే రూ.5వేల కంటే ఎక్కువ డిస్కౌంట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే మార్కెట్‌లోకి ఐ ఫోన్ 17 విడుదలైన సంగతి తెలిసిందే. ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ కావడంతో కొనుగోలు చేసేందుకు ఆపిల్ లవర్స్ ఎగబడుతున్నారు. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.82,900 కాగా ప్రస్తుతం దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రారంభ ధర కంటే ఏకంగా రూ.5వేలకు పైగా తగ్గింది. అయితే ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ పొందలేం. జెప్టో యాప్‌లో కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

జెప్టోలో ఈ ఫోన్ ధర రూ.78,079గా ఉంది. ఇందులో ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా మరో రూ.250 డిస్కౌంట్ లభిస్తోంది. ఐ ఫోన్ 17 మార్కెట్ లోకి వచ్చిన తరవాత ఇంత పెద్దమొత్తంలో డిస్కౌంట్ లభించడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 256 ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఉంది. ఇందులో 16.0 సెంటీమ‌ర్ల సూప‌ర్ రెటీనా ఎక్స్ డీ ఆర్ డిస్‌ప్లే ఉంది. అదే విధంగా వెనుక భాగంలో 48MP + 48MP డ్యూయల్ కెమెరా ఉంది.

దీంతో పాటు 18 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ A19 Chip, 6 Core Processor ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ తో పాటు యూఎస్బీ సీటైప్ చార్జ‌ర్ వ‌స్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కు సైతం ఇది స‌పోర్ట్ చేస్తుంది. ఫుల్ చార్జింగ్ పెడితే 30 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది. అంతే కాకుండా ఇది లావెండ‌ర్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ క‌ల‌ర్స్ లో ఎంతో స్టైలిష్ డిజైన్ తో అందుబాటులో ఉంది. ఒక‌వేళ మీరు ఐఫోన్ ల‌వ‌ర్స్ అయితే ఇది బెస్ట్ ఆప్ష‌న్.

Next Story