- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ChatGPT Free, ChatGPT Go మధ్య తేడా ఏంటి? సబ్‌స్క్రిప్షన్ అవసరమా?
దేశంలో ఏఐ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచంలోనే భారత్ ఏఐ వినియోగంలో రెండో స్థానంలో ఉందని, అమెరికా మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్ మాన్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఏఐ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచంలోనే భారత్ ఏఐ వినియోగంలో రెండో స్థానంలో ఉందని, అమెరికా మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్ మాన్ వెల్లడించారు. ఇక ఇప్పటికే చాట్ జీపీటీ ఏఐ ఎక్కువగా వినియోగిస్తుండగా దాని తయారీ సంస్థ చాట్ జీపీటీ గో అనే మరో వర్షెన్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రస్తుతం చాట్ జీపీటీ ఫ్రీ, చాట్ జీపీటీ గో వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. చాట్ జీపీటీ ఉచిత వర్షన్‌ను పరిమితంగా మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇందులో కొన్ని సందేశాలను మాత్రమే పొందవచ్చు, అంతే కాకుండా ఇది తక్కువ వేగంతో పనిచేస్తుంది. మరియు ఇందులో మెమోరీ స్టోరేజీ సైతం తక్కువగా ఉంటుంది. ఇక చాట్ జీపీటీ గో విషయానికి వస్తే ఇందులో స్టోరేజీ మెమోరీ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అపరిమితమైన సందేశాలను పొందవచ్చు. ఇక స్పీడ్ అయితే ఉచిత వర్షన్ కంటే ఏకంగా 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. సందేశాలు అయినా, ఇమేజ్ జనరేషన్ అయినా చాలా వేగంగా ఇస్తుంది. అయితే ఉచిత వర్షన్ కు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ చాట్ జీపీటీ గో ఉపయోగించాలి అంటే నెలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులను యూపీఐ పేమెంట్స్ ద్వారా లేదా ఆన్ లైన్ బ్యాకింగ్ ద్వారా చెల్లించవచ్చు.






