Whatsapp: వాట్సాప్‌లో ఈ అద్భుత ఫీచర్ గురించి మీకు తెలుసా?

by Yella Dhawani Reddy |

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Whatsapp: వాట్సాప్‌లో ఈ అద్భుత ఫీచర్ గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ (Smartphone) ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తుంటారు. ఇక యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ నుంచి కాల్ చేసే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉంది. కానీ, చాలా మందికి దీని గురించి తెలియదు.

వాట్సాప్ నుంచి ఎవరికైనా కాల్ చేయాలంటే కచ్చితంగా నంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి వచ్చేంది. కానీ, ఇప్పుడు అవసరం లేదు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కాలింగ్ సెక్షన్ వెళ్లాలి. '+' ఐకాన్‌పై ట్యాప్ చేస్తే.. Call Number ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ నంబరుపై వాట్సాప్ అందుబాటులో ఉంటే నేరుగా కాల్ చేయవచ్చు. ఎవరికైనా ఈ ఫీచర్ అందుబాటులో లేకపోతే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

అలాగే, బ్రౌజర్‌లో వాట్సాప్ ఉపయోగిస్తుంటే.. అక్కడి నుంచి కాల్స్ చేయవచ్చు. ఇందుకోసం Chrome ఓపెన్ చేయాలి. అడ్రస్ బార్‌లో https://wa.me/91పది అంకెల ఫోన్ నంబరు టైప్ చేసి, ఎంటర్ క్లిక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కాల్ లేదా మెసేజ్ పంపవచ్చు. ఈ ఫీజర్ ద్వారా డెలివరీ ఏజెంట్లు, హోటల్, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు అందించేవాళ్లు, సింగిల్ టైం యూజ్‌కి బాగా ఉపయోగపడుతుంది.

Next Story