కొత్తగా రెండు ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన Dell

by Disha Web Desk 17 |
కొత్తగా రెండు ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన Dell
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో డెల్(Dell) కంపెనీ కొత్తగా రెండు గేమింగ్ ల్యాప్‌టాప్‌‌లను లాంచ్ చేసింది. అవి ‘Alienware m16’, ‘Alienware x14 R2’. ఈ రెండు కూడా డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, డెల్ వెబ్‌సైట్, అమెజాన్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.



Alienware m16:

ఈ ల్యాప్‌టాప్ 16-అంగుళాల క్వాడ్-HD+ (2,560x1,6000 పిక్సెల్‌లు) స్క్రీన్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 165Hzగా ఉంది. 13th Gen ఇంటెల్ కోర్ i9-13900HX ప్రాసెసర్‌తో వస్తుంది. Nvidia GeForce 40-సిరీస్ గ్రాఫిక్స్ కార్డ్‌ కూడా ఉంది. దీనిలో 32GB RAM 1TB వరకు మెమరీని అందించారు. 6-సెల్ 86Wh బ్యాటరీ ఉంది. దీని కోసం 33W పవర్ అడాప్టర్‌ను కూడా ఇచ్చారు. ల్యాప్‌టాప్ 1080p కెమెరాను కలిగి ఉంది. డ్యూయల్ 2W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. అలాగే, దీని బరువు 3.25 కిలోలు. Alienware m16 ప్రారంభ ధర రూ. 1,84,990.



Alienware x14 R2:

ఈ మోడల్ 14-అంగుళాల క్వాడ్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 165Hz. 13th Gen ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. Nvidia GeForce RTX 4060 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్‌ కూడా ఉంది. 32GB DDR5 RAM, 1TB మెమరీని అందించారు. 130W టైప్-C పవర్ అడాప్టర్‌తో 80Wh బ్యాటరీని కలిగి ఉంది. Windows Hello సపోర్ట్‌తో 1080p కెమెరాను అమర్చారు. దీనిలో ప్రత్యేకమైన కూలింగ్ టెక్నాలజీని అందించారు. దీని బరువు 1.91కిలోలు. Alienware x14 R2 ధర రూ. 2,06,990 నుండి ప్రారంభమవుతుంది.




Next Story

Most Viewed