డీప్‌ ఫేక్ వీడియోలకు ఇక చెక్.. అందుబాటులోకి లైక్‌నెస్‌ డిటెక్షన్‌ టూల్‌

by Kema Shiva Kumar |

గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంలో ఏఐ (AI) జనరేటెడ్ డీప్‌ఫేక్ వీడియో (Deep Fake Videos)ల నుంచి కంటెంట్ క్రియేటర్ల డిజిటల్ లైక్‌నెస్ (ఫేస్, వాయిస్)ను రక్షించేందుకు లైక్‌నెస్ డిటెక్షన్ టూల్‌ (Likeness Detection Tool)ను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

డీప్‌ ఫేక్ వీడియోలకు ఇక చెక్.. అందుబాటులోకి లైక్‌నెస్‌ డిటెక్షన్‌ టూల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంలో ఏఐ (AI) జనరేటెడ్ డీప్‌ఫేక్ వీడియో (Deep Fake Videos)ల నుంచి కంటెంట్ క్రియేటర్ల డిజిటల్ లైక్‌నెస్ (ఫేస్, వాయిస్)ను రక్షించేందుకు లైక్‌నెస్ డిటెక్షన్ టూల్‌ (Likeness Detection Tool)ను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టూల్ యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లోని అర్హులైన 100 కోట్ల మంది క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈ టూల్ క్రియేటర్ల అనుమతి లేకుండా వారి ఫేస్ లేదా వాయిస్‌ను ఉపయోగించిన వీడియోలను ఐడీ వెరిఫికేషన్ చేసి, ఏఐ డీప్ స్కానింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగిస్తుంది.

కాగా, అక్టోబర్ 21 నుంచి అంటే నేటి నుంచి భారత్‌ (India)తో పాటు మరో 20 దేశాల్లో ఈ టూల్ లిమిటెడ్‌గా అందుబాటులోకి రానుంది. అయితే, యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో 500 సబ్‌స్క్రైబర్లు, 3,000 వాచ్ అవర్స్ ఉన్న క్రియేటర్లు మాత్రమే ఈ టూల్‌ను వాడగలరు. లైక్‌నెస్ డిటెక్షన్ టూల్‌ పొందాలంటే మందుగా యూట్యూబ్ స్టూడియో యాప్‌లోకి వెళ్లి కంటెంట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని లైక్‌నెస్ డిటెక్షన్ ట్యాబ్‌కు వెళ్లాలి. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ ఆప్షన్‌ను క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైన ధృవ పత్రం (పాస్‌పోర్ట్/డ్రైవర్ లైసెన్స్/ఆధార్).. అదేవిధంగా 10 సెకన్ల సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేయాలి. చివరన ఏఐ కన్ఫర్మేషన్ తర్వాత లైక్‌నెస్ డిటెక్షన్ టూల్ యూజర్స్‌కు యాక్టివేట్ అవుతుంది.

Next Story