- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమికి దగ్గరగా వస్తున్న 3I/ATLAS తోకచుక్క
భూమికి అతిదగ్గరగా వస్తున్న మరో తోకచుక్క ఖగోళ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : భూమికి అతిదగ్గరగా వస్తున్న మరో తోకచుక్క ఖగోళ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేస్తోంది. ఇంటర్‌స్టెల్లార్ అయినందుకు 'I', మూడవదైనందుకు '3', ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే సంక్షిప్త రూపం 'ATLAS' తోకచుక్కగా దీనికి పేరు పెట్టారు. చిలీ టెలిస్కోప్ ద్వారా జులైలో మొదటిసారి గుర్తించగా.. ముందు దానిని మన సౌరవ్యవస్థకు అవతలి నుంచి వచ్చిన అతిథిగా భావించారు. అయితే ఈ పదార్థం క్రమంగా వేగం పెంచుకుని ప్రస్తుతం గంటకు 2,44,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
గత అక్టోబర్ 29న సూర్యునికి సమీపిస్తున్నకొద్దీ బ్లూ రంగులో మెరిసిపోయింది. రానున్న నవంబర్-డిసెంబర్‌లో ఆ ఆబ్జెక్ట్ వెనక వాయువు క్షేత్రం అయిన తోక కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక డిసెంబర్‌లో భూమికి అత్యంత దగ్గరగా.. అనగా 269 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్న ఈ మిస్టీరియస్ తోకచుక్క వల్ల ప్రస్తుతం భూమికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చారు.






