- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
I PHONE: ఐ ఫోన్ యూజర్లకు కేంద్రం వార్నింగ్
ఐఫోన్, మ్యాక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. వినియోగదారుల డేటా దొంగలించేందుకు సెక్యురిటిని దాటవేయగల శక్తివంతమైన స్పైవేర్‌ను సైబర్ నేరగాళ్లు ఫోన్‌లలో ప్రవేశపెడుతున్నట్టు హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్, మ్యాక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. వినియోగదారుల డేటా దొంగలించేందుకు సెక్యురిటిని దాటవేయగల శక్తివంతమైన స్పైవేర్‌ను సైబర్ నేరగాళ్లు ఫోన్‌లలో ప్రవేశపెడుతున్నట్టు హెచ్చరించింది. దేశంలోని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఫోన్లకు స్పైవేర్ ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం CERT-In హెచ్చరించింది. ఏ విధంగా యూజర్లు స్పైవేర్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో వివరాలు వెల్లడించింది.
స్పైవేర్ దాడులను ఆపడం కూడా కష్టమని పేర్కొంది. యూజర్లకు యూఆర్ఎల్ లింక్స్ పంపి సమాచారాన్ని దొంగలిస్తారని హెచ్చరించింది. మాల్వేర్ మాదిరికాకుండా స్పైవేర్‌లకు లింక్ పై క్లిక్చేయడం లేదా వాటిని ఫోన్‌లోకి అనుమతించడం ద్వారా ఫోన్ హ్యాక్ అవుతుందని తెలిపింది. పెగాసస్ లాంటి స్పైవేర్ సైబర్ ఎటాక్స్‌కు అడ్డాగా మారాయన్నారు.
ప్రతి రోజు బిలియన్స్ మంది ఉపయోగించే వాట్సాప్ లాంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా సందేశాలు, చిత్రాలు పంపడం, లేదా వీడియో కాల్స్ చేయడం లాంటివి సైబర్ నేరగాళ్లు చేస్తూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారని పేర్కొంది. స్పైవేర్ ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ఐఓఎస్ డివైజ్లలో 2.25.21.73 కి ముందున్న వర్షన్ డివైజ్‌లు ఉన్నాయని తెలిపింది. అంతే కాకుండా ఐఓఎస్ వాట్సాప్ బిజినెస్ వర్షెన్ 2.25.21.78, మ్యాక్ వాట్సాప్ వర్షెన్ 2.25.21.78లకు హ్యాకింగ్ ప్రమాదం ఉందని పేర్కొంది.






