అలర్ట్: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

by Disha Web Desk 2 |
అలర్ట్: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆండ్రాయిడ్ మాల్ వేర్ ‘దామ్’ తో ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తోందని తెలిపింది. ఈ మాల్ ఫోన్లలోకి చొరబడి కాల్ రికార్డులు, కాంటాక్ట్ వివరాలు, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తస్కరిస్తోందని జాతీయ సైబర్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. పాస్ వర్డులను మార్చడంతో పాటు స్క్రీన్ షాట్ లను తీయడం ఎస్ఎంఎస్ లను తస్కరిస్తుందని తెలిపింది.

అధునాతన ఎన్ క్రిప్షన్ స్టాండర్డ్ అల్గారిథం తో ఫోన్ లో ఉన్న ఫైల్స్ ను ఎన్ కోడ్ చేస్తుందని హెచ్చరించింది. సెక్యూరిటీ ప్రోగ్రామ్ లను బోల్తా కొడుతూ ఫోన్ లోకి ప్రవేశించాక యాంటీవైరస్ కు చిక్కకుండా అందుకు అనుగుణంగా రాన్ సమ్ వేర్‌ను డెవలప్ చేసుకునే సామర్ధ్యం దీనికి ఉందని తెలిపింది. దీని బారిన పడకుండా ఉండేందుకు అనుమానాస్పద లింకుల జోలికి వెళ్లవద్దని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఎజెన్సీతో పాటు సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed