'కలకత్తా 64' అద్భుత ఆవిష్కరణ.. డ్రోన్లతో కస్టమర్లకు కాఫీ సర్వీస్..

by Disha Web Desk 20 |
కలకత్తా 64 అద్భుత ఆవిష్కరణ.. డ్రోన్లతో కస్టమర్లకు కాఫీ సర్వీస్..
X

దిశ, ఫీచర్స్ : మనం టీ లేదా కాఫీ తాగడానికి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడల్లా వెయిటర్లు మీ టేబుల్ వద్ద టీ, కాఫీ కోసం ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల టాయ్ రైళ్ల సహాయంతో టేబుల్‌ పై ఆహారాన్ని సప్లై చేస్తుంటే మరికొన్నింటిలో రోబోలు వెయిటర్‌లుగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టీ, కాఫీ అందిస్తున్న డ్రోన్‌ని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రోన్ తో కాఫీ, టీ సప్లై చేయడం ఏంటి అనుకుంటున్నారా మరి ఆ రెస్టారెంట్ ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో 'కలకత్తా 64' పేరుతో ఒక కేఫ్ ఉంది. ఇది దాని ప్రత్యేకత కారణంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కేఫ్‌లో మీకు ఇష్టమైన కాఫీని ఆర్డర్ చేస్టే డ్రోన్ ఆ కాఫీని నిమిషాల్లో అందిస్తుంది. వైరల్ వీడియోలో, డ్రోన్ పైన కాఫీ కప్పు ఉంచడం, అది గాలిలో ఎగిరి కస్టమర్‌కు చేరుకోవడం కూడా మీరు చూడవచ్చు. కస్టమర్ డ్రోన్ నుండి కాఫీ కప్పును తీసిన వెంటనే, డ్రోన్ ఆటోమేటిక్‌గా వెనక్కి వెళ్లిపోతుంది.

అయితే ఈ డ్రోన్ హోమ్ డెలివరీ కోసం కాదని చెబుతున్నారు. మీరు కలకత్తా 64 కేఫ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రత్యేక సేవను పొందవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో thekolkatabuzz అనే IDతో షేర్ చేశారు. ఇది ఇప్పటి వరకు 7 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు.



Next Story

Most Viewed