- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BSNL Holi Offer: దటీజ్ బీఎస్ఎన్ఎల్..ఇంత ఆఫర్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు
BSNL Holi Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తన సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు నెట్ వర్క్ మౌలిక సదుపాయాలపై కూడా పనిచేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: BSNL Holi Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తన సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు నెట్ వర్క్ మౌలిక సదుపాయాలపై కూడా పనిచేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థం నాటికి దేశవ్యాప్తంగా 100,000 కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
మీరు బీఎస్ఎన్ఎల్(BSNL) కస్టమర్ అయితే మీకో గుడ్ న్యూస్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో బీఎస్ఎన్ఎల్(BSNL) తన 9కోట్లకు పైగా వినియోగదారుల కోసం హోలీ ధమాకా ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రీఛార్జ్ ప్లాన్ (Recharge plan)చెల్లుబాటును ఒక నెల పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే కంపెనీ ఈ ప్లాన్ లో 30రోజుల చెల్లుబాటును ఫ్రీగా అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తన కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని బీఎస్ఎన్ఎల్ (BSNL) ఆశిస్తోంది.
బీఎస్ఎన్ఎల్(BSNL) ఇప్పుడు తన రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజుల అదనపు చెల్లుబాటును ఇస్తోంది. గతంలో ఈ ప్లాన్ 395 రోజుల చెల్లుబాటును అందించేది. కానీ ఇప్పుడు దీని మొత్తం చెల్లుబాటు 425 రోజులు. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్(BSNL prepaid plan) లో భారతదేశం అంతటా అన్ లిమిటెడ్ కాలిం, ఫ్రీ రోమింగ్, ఢిల్లీ ముంబైలోని ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్ లో కాంప్లిమెంటరీ కాలింగ్ ఉన్నాయి. దీంతోపాటు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్(BSNL prepaid plan) లో 60 జీబీ డేటా కూడా పూర్తి ఫ్రీగా లభిస్తుంది.
ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు పొందుతారు. ఇది మొత్తం 850 జీబీ డేటాకు సమానం. ఇదేగాకుండా బీఎస్ఎన్ఎల్ మొబైల్ కస్టమర్లకు బిటీవీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. అనేక ఓటీటీ అప్లికేషన్లకు ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది.
తన సర్వీసులను మరింత మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ (BSNL prepaid plan)తన నెట్ వర్క్ మౌలిక సదుపాయాలపై కూడా పనిచేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థం నాటికి దేశవ్యాప్తగా 100, 000 కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. గత ఒక సంవత్సరం కాలంగా బీఎస్ఎన్ఎల్(BSNL prepaid plan) అన్ని టెలికాం సర్కిల్లో తన నెట్ వర్క్ ను చురుకుగా అప్ గ్రేడ్ చేస్తోంది. ఇప్పటికే 65,000 కంటే ఎక్కువ 4జీ మొబైల్ టవర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన టవర్లు రాబోయే నెలల్లో ఆన్ లైన్ లోకి వస్తాయని వినియోగదారులకు మరింత మెరుగైన కనెక్టివిటీని హామీ ఇస్తున్నాయని భావిస్తున్నారు.






