iPhone 16 Proపై భారీ తగ్గింపు.. అక్కడ తీసుకుంటే ఏకంగా రూ.20వేలు సేఫ్

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం ఐఫోన్ 17సిరీస్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో 16 సిరీస్ పైనా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ దర్శనం ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఫోన్ 16ప్రో పై తాజాగా భారీ డిస్కౌంట్ ఆఫర్ కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.1,19,900 కాగా ఇప్పుడు రూ.19,910 డిస్కౌంట్‌తో రూ.99,990కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

iPhone 16 Proపై భారీ తగ్గింపు.. అక్కడ తీసుకుంటే ఏకంగా రూ.20వేలు సేఫ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఐఫోన్ 17సిరీస్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో 16 సిరీస్ పైనా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ దర్శనం ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఫోన్ 16ప్రో పై తాజాగా భారీ డిస్కౌంట్ ఆఫర్ కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.1,19,900 కాగా ఇప్పుడు రూ.19,910 డిస్కౌంట్‌తో రూ.99,990కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర కేవలం బిగ్ బాస్కెట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

దీనిలో ఫోన్ ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాలకే చేతికి అందుతుంది కూడా. అంతే కాకుండా క్రెడిట్ కార్డులు ఉపయోగించడం ద్వారా బిగ్ బాస్కెట్ లో మరింత డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉండటంతో మీరు ఎక్స్ చేంజ్ చేసే ఫోన్ పరిస్థితి బట్టి దానిపై డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.... ఇందులో 6.3 ఇంచుల Super Retina XDR Display ఉంది. 128GB ఇంటర్నల్ మెమోరీ ఉంది.

ఈ మొబైల్ Apple A18 Pro Chip, Hexa Core ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. అదే విధంగా రేర్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ తో 48 MP + 48 MP + 12MP అద్బుతమైన ఫోటోలు తీయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ఫ్రంట్ కెమెరా 12 మెగాక్సల్ గా ఉంది. ఈ ఫోన్ మంచి బ్యాటరీ బ్యాకప్ తో 25W MagSafe వైర్ లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఇందులో కెమెరా కంట్రోల్, యాపిల్ ఇంజిలిజెన్స్, ప్రోమోషన్ టెక్నాలజీ ఆప్షన్స్ ఉన్నాయి.

Next Story