- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Realme GT 7 Proపై భారీ డిస్కౌంట్.. Flipkartలో దీని ధర ఎంతంటే?
పండుగల సీజన్ పూర్తైనా ఫ్లిప్ కార్ట్‌లో కొన్ని ఫోన్స్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Realme GT Pro 7 మొబైల్ పై సైతం భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. దీని లాంఛింగ్ ధర రూ.59,999గా ఉండగా ప్రస్తుతం ఆఫర్‌లో రూ.17225 డిస్కౌంట్ లభిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పండుగల సీజన్ పూర్తైనా ఫ్లిప్ కార్ట్‌లో కొన్ని ఫోన్స్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Realme Gt 7 pro మొబైల్ పై సైతం భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. దీని లాంఛింగ్ ధర రూ.59,999గా ఉండగా ప్రస్తుతం ఆఫర్‌లో రూ.17225 డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్‌లో Realme GT 7 Pro ఆరెంజ్ వేరియంట్ ధర రూ.44,999గా ఉండగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం ద్వారా మరో రూ.2,225 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో ఈ ఫోన్ కేవలం రూ.42,774కే వస్తుంది. అంటే మొత్తం డిస్కౌంట్ రూ.17,225గా ఉంది. మరోవైపు ఈ ఫోన్ పై రూ.48,690 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ఫోన్ పరిస్థితి బట్టి రూ.48,690 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందలో 6.8 అంగుళాల FHD+ AMOLED డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
అంతేకాకుండా దీనిలో50 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్, 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సైతం ఉంది. దీంతో ఫ్రంట్, రేర్ కెమెరాలతో క్వాలిటీ ఫోటోలను తీయవచ్చు. అదేవిధంగా దీనిలో 5,800mAhతో భారీ బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే, వైట్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది.






