Samsung Galaxy Z Fold 6పై అక్కడ భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.64,000 తగ్గిన ఫోన్ ధర!

by Ajay Maddhiboyina |

పండగవేళ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే Samsung Galaxy Z Fold 6పై సైతం భారీ ఆఫర్ ప్రకటించారు. సాధారణంగా Samsung Galaxy Z Fold 6 లాంచింగ్ ధర రూ.1,64,999 కాగా ప్రస్తుతం ఈ డివైజ్ కేవలం రూ.1,03,999కే పొందవచ్చు.

Samsung Galaxy Z Fold 6పై అక్కడ భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.64,000 తగ్గిన ఫోన్ ధర!
X

దిశ, వెబ్ డెస్క్: పండగవేళ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే Samsung Galaxy Z Fold 6పై సైతం భారీ ఆఫర్ ప్రకటించారు. సాధారణంగా Samsung Galaxy Z Fold 6 లాంచింగ్ ధర రూ.1,64,999 కాగా ప్రస్తుతం ఈ డివైజ్ కేవలం రూ.1,03,999కే పొందవచ్చు. అంటే ఈ ఫోన్ పై ఏకంగా రూ.64,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ.3,119 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కాబట్టి Fold 6 లవర్స్ కి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే... 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ మెమోరీతో వస్తుంది. ఇందులో అగ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండటం వల్ల బెస్ట్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 7.6 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X ఇన్నర్ డిస్ ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్, నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.3 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X కవర్ డిస్ ప్లే ఉన్నాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది సిల్వర్ షాడో, నేవీ రెండు వేరు వేరు రంగులలో లభిస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్,123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు ఆప్టికల్ జూమ్ తో 10 మెగాపిక్సల్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరాలో 4 మెగాపిక్సల్ అండర్ డిస్ ప్లే సెన్సార్ మరియు 10 మెగాపిక్సల్ కవర్ సెన్సార్ కనిపిస్తాయి. అంతే కాకుండా 4400mAh బ్యాటరీ ఉండగా.. 25W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Next Story