- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iPhone 16 Plusపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. రూ.90వేల ఫోన్ ఇప్పుడు రూ.50వేలకే
ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా పలు ఆఫ్ లైన్ షాపింగ్ తో పాటు ఆన్ లైన్ షాపింగ్‌లోనూ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో గ్యాడ్జెట్స్ పై మంచి ఆఫర్స్ కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా పలు ఆఫ్ లైన్ షాపింగ్ తో పాటు ఆన్ లైన్ షాపింగ్‌లోనూ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో గ్యాడ్జెట్స్ పై మంచి ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. iPhone 16 Plus లాంచింగ్ ధర రూ. 89,900 కాగా ప్రస్తుతం ఇది జియోమార్ట్‌లో దీనిపై రూ.22,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర ప్రస్తుతం రూ.67,990గా ఉంది.
అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ వినియోగించడం ద్వారా అడిషనల్‌గా మరో రూ.8,500 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కార్డ్ తో తీసుకోవడం ద్వారా ఫోన్ రూ.59,490కే లభిస్తోంది. అంతే కాకుండా ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉండటంతో మీరు అన్నీ కలిపి మొత్తం రూ.30వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.7 ఇంచుల Super Retina XDR OLED display ఉంది.
దీంతో పాటు 4674 mAh లాంగ్ లైఫ్ బ్యాటరీ ఉంది. అదేవిధంగా IP68-rated వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో డ్యూరబుల్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. క్లారిటీ ఫోటోల కోసం 48-megapixel మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా సైతం ఉంది. ఇక కలర్స్ విషయానికి వస్తే బ్లాక్, వైట్, పింగ్, టీల్ తో పాటు అల్ట్రామెరైన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.






