- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ యాప్ కేసు.. గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఎంతో మందిని ఆర్థికంగా కుంగదీసి, చివరికి ప్రాణాలనే బలితీసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఎంతో మందిని ఆర్థికంగా కుంగదీసి, చివరికి ప్రాణాలనే బలితీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసులో తన దర్యాప్తును మరింత వేగంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ యాప్‌ల ప్రమోషన్ ఆరోపణలపై ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ కేసులో పెద్ద మలుపు తిరిగింది. టెక్ దిగ్గజాలు గూగుల్ (Google), మెటా (Meta) కంపెనీలు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి ఈ రెండు టెక్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్లలో వేదిక కల్పించాయని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారికంగా నోటిసులిచ్చింది. దీనిపై ఈ రెండు సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.






