భారీగా తగ్గిన Samsung Galaxy S24.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో అదిరిపోయే ఆఫర్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-25 12:18:55  IST  )

ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో దసరా దమాకా సేల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

భారీగా తగ్గిన Samsung Galaxy S24.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో అదిరిపోయే ఆఫర్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో దసరా దమాకా సేల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని పాపులర్ మొబైల్స్‌ను తక్కువ ధరకే అమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సామ్ సంగ్ గెలాక్సీ S24పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ పై దాదాపు 40 శాతం తగ్గించింది. 256GB ఇంటర్నల్ స్టోరేజీ, 8GB RAM కలిగిన Samsung Galaxy S24 అసలు ధర రూ. రూ.79,999 కాగా ఫ్లిప్ కార్ట్‌లో ప్రస్తుతం దీనిని కేవలం రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాకుండా కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే అదనంగా మరో రూ.2200 డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది నాలుగు వేరు వేరు కలర్స్ లో లభిస్తుంది. ఇందులో 6.2 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఇది Android 14 OS పనిచేస్తుంది. దీంతో పాటు ఈ డివైస్ లో రేర్ కెమెరా ట్రిపుల్ కెమెరా 50+10+12 మెగాపిక్స‌ల్స్ తో ఉంది. దీంతో పాటు 12 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను క‌లిగి ఉంది. ఇందులో 25W ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఇచ్చే 4000mAh బ్యాట‌రీ ఉంది. ఒకవేళ ఈ పండగకి ఫోన్ కొనాలని అనుకంటే సామ్ సంగ్ ఇష్టపడేవారికి చాలా మంచి ఎంపిక అవుతుంది. అంతే కాకుండా సేల్ అవ్వకముందే బుక్ చేసుకుంటే డబ్బు కూడా ఎంతో ఆదా అవుతుంది.

Next Story