- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Best gaming mobiles: రూ.60వేల లోపు ఉన్న 5 బెస్ట్ గేమింగ్ మొబైల్స్ ఇవే!
చాలా మంది గేమింగ్ ఫోన్స్ కొనేందుకు ఇష్టపడతారు. అయితే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మొబైల్స్ కావాలంటే రూ.60వేల పైనే ఖర్చు చేయాలని అనుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది గేమింగ్ ఫోన్స్ కొనేందుకు ఇష్టపడతారు. అయితే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మొబైల్స్ కావాలంటే రూ.60వేల పైనే ఖర్చు చేయాలని అనుకుంటారు. కానీ ఆ లోపు కూడా కొన్ని అదిరిపోయే మొబైల్స్ ఉన్నాయి. ఫాస్ట్ ప్రాసెసర్స్ తో పాటు ఎక్కువ కాలం చార్జింగ్ వచ్చే ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే తక్కవ బడ్జెట్ లోనే మీకు అద్భుతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది.
వన్ ప్లస్ 13s
ఈ ఫోన్ ధర రూ.54,999 కాగా గేమింగ్ కోసం ఇది బెస్ట్ మోడల్ అనే చెప్పాలి. స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్ ఇచ్చే ఈ మొబైల్ 6.32 ఇంచుల ఆల్మండ్ డిస్ప్లేతో లభిస్తోంది. ఇందులో డోల్బీ సపోర్ట్ కూడా ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండటం వల్ల కఠినమైన గేమ్స్ కూడా ఇందులో ఆడవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 80W ఫాస్ట్ చార్జింగ్‌తో 5850mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది.
ఐఫోన్ 16e
ఈ ఫోన్ ధర రూ.53,600 కాగా స్మూత్ గేమ్ ప్లేతో మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది. 6.1 ఇంచులతో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 4005 mAh బ్యాటరీతో 7.5W వైర్ లెస్ చార్జింగ్ ఈ మొబైల్ ప్రత్యేకత. ఇందులో ఎంతసేపు గేమ్ ఆడినా ఫోన్ వేడి అవ్వదు.
రియల్ మీ GT 7 Pro
ఈ ఫోన్ ధర రూ.54,998 కాగా దీని డిస్‌ప్లే 6.78 ఇంచులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ సెన్సార్‌తో రూపొందించిన ఈ ఫోన్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5800mAh కాగా 120W అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన ఈ ఫోన్ గేమర్స్ కోసమే రూపొందించబడింది.
iQOO 13
ఐక్యూ 13 ధర రూ.55,990 కాగా ఇందులో 6.82 ఇంచుల ఆల్మండ్ డిస్‌ప్లేతో ఉంది. ఈ ఫోన్ ద్వారా కూడా స్మూత్ గేమ్‌ప్లేను యూజర్లు పొందవచ్చు. స్మాప్ డ్రాగన్ 8ఎలైట్ ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉంది. 6150mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఈ ఫోన్ బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
గూగుల్ పిక్సల్ 9a
గూగుల్ పిక్సల్ 9a ధర రూ.49,999 కాగా ఇందులో 6.3 ఇంచుల డిస్ ప్లేతో జీ7 ప్రాసెసర్ ఉంది. అదే విధంగా 5100mAh లాంగ్ లాస్టింగె బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఈ మొబైల్‌తో ఫుల్ బ్యాటరీ చార్జ్ చేస్తే ఒక రోజంతా గేమ్స్ ఆడవచ్చు.






