గేమింగ్ కోసం మార్కెట్‌లో ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ ఇవే!

by Ajay Maddhiboyina |

స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ఫీచర్ ప్రధానంగా ఉండాలని అనుకుంటారు. కొందరు కెెమెరా కోరుకుంటే మరికొందరు స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటారు. అలానే గేమింగ్ ప్రియులు కూడా ఉంటారు. అలా గేమ్స్ కోసం మంచి ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికోసం మార్కెట్ లో ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం.

గేమింగ్ కోసం మార్కెట్‌లో ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ ఇవే!
X

దిశ‌, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ఫీచర్ ప్రధానంగా ఉండాలని అనుకుంటారు. కొందరు కెెమెరా కోరుకుంటే మరికొందరు స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటారు. అలానే గేమింగ్ ప్రియులు కూడా ఉంటారు. అలా గేమ్స్ కోసం మంచి ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికోసం మార్కెట్ లో ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం.

iQOO 13:

గేమింగ్ కోసం తీసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ ఫోన్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.55వేలు ఉంది. ఐకూ 13 ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్‌తో పనిచేస్తుంది. ఇది అల్ట్రా ఫాస్ట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కోసం బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి. ఈ చిప్ సెట్‌తో పాటు క్యూ2 గేమింగ్ చిప్ కూడా ఫోన్ లో ఉంది. కాబట్టి గేమింగ్ ప్రియులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

రియల్ మీ జీటీ7 ప్రో:

ఈ ఫోన్ ధర రూ.49,999 కాగా మార్కెట్‌లోని బెస్ట్ గేమింగ్ మొబైల్స్‌లో ఇది ఒకటి. ఇందులో స్పష్టమైన డిస్ ప్లేతో పాటు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా ఇందులో 5800ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో గేమింగ్‌కు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా:

ఈ ఫోన్ ధర రూ.49,999 కాగా 6.7 అంగులాల ఎడ్జ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ ప్రాసెసర్ కలిగి ఉంది. 125W సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. గేమింగ్ ప్రియుల కోసం ఇది కూడా ఓ మంచి ఆప్షన్.

గూగుల్ పిక్సల్ 9ఏ:

ఈ ఫోన్ ధర కూడా రూ.49,999 కాగా ఇది 6.3 అంగుళాల ఆక్టా ప్యానెల్ కలిగి ఉంది. ఇది గూగుల్ కస్టమ్ టెన్సార్ జీ4 ప్రాసెసర్ పై ఆధారపడి పనిచేస్తుంది. అంతే కాకుండా 23W ఛార్జింగ్‌తో 5100mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా పనిచేస్తుంది. కాబట్టి గేమింగ్ కోసం ఇది కూడా బెస్ట్ ఫోన్.

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26:

ఈ ఫోన్ ధర మిగితా గేమింగ్ ఫోన్ల కంటే తక్కువే. దీని ధర రూ.43,800 కాగా 6.2 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే చాలా క్లారిటీగా ఉంటుంది. ఇందులో Exynos 2400 ప్రాసెసర్ ఉండగా, 25W చార్జింగ్ తో 4000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇది మిగితా గేమింగ్ ఫోన్ ల కంటే తక్కువ ధరకే వచ్చినప్పటికీ పర్ఫామెన్స్‌లో మాత్రం సమాన పోటీ ఇస్తుంది.

Next Story