FLIPKART SALE: రూ.10వేల‌ నుండి రూ.15వేల మ‌ధ్య ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

by Ajay Maddhiboyina |

ప్ర‌స్తుతం ద‌స‌రా వేళ ప్ర‌ముఖ ఈకామ్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ న‌డుస్తోంది. ఈ సేల్‌లో పలు మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.10వేల నుండి రూ.15వేల మధ్య కూడా కొన్ని బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి.

FLIPKART SALE: రూ.10వేల‌ నుండి రూ.15వేల మ‌ధ్య ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ద‌స‌రా వేళ ప్ర‌ముఖ ఈకామ్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ న‌డుస్తోంది. ఈ సేల్‌లో పలు మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.10వేల నుండి రూ.15వేల మధ్య కూడా కొన్ని బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. రూ.14,999కి MOTOROLA G96 5G వ‌స్తుంది. ఇది క‌ర్వ్డ్ డిస్ ప్లేతో ఎంతో స్టైలిష్ గా ఉండ‌గా 8 GB RAM | 128 GB ROM ఉన్నాయి. ఈ డివైజ్ 16.94 cm ఉండ‌గా 6.67 ఇంచుల‌ Full HD Display ఉంది. అంతే కాకుండా 50MP + 8MP రేర్ కెమెరాతో పాటు 32MP ఫ్రంట్ కెమెరా ఉండ‌టం విశేషం.

Nothing Phone 2 Pro :

Nothing Phone 2 Pro ఫోన్ ధ‌ర రూ.16,999 ఉండగా డిస్కౌంట్ లో ఇది కూడా రూ.15వేల వ‌రకు వ‌స్తుంది. ఇందులో 8 GB RAM, 128 GB ROM ఉన్నాయి. దీని డిస్ ప్లే 6.77 ఇంచుల‌తో స్టైలిష్ లుక్ లో ఈ మొబైల్ ఉంటుంది. దీనిలో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ Dimensity 7300 Pro 5G Processorతో ర‌న్ అవుతుంది.

realme P3 5G :

realme P3 5G ఫోన్ కూడా రూ.రూ.15వేలకే ల‌భిస్తుంది. దీని ధ‌ర రూ.15,999 ఉండ‌గా క్రెడిట్ కార్డుల‌పై మ‌రో రూ.1000 వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ డివైజ్లో 6 GB RAM, 128 GB ROM ఉంది. 6.67 ఇంచుల‌ HD+ Display ఉంది. దీది రేర్ కెమెరా 50MP + 2MP కాగా ఫ్రంట్ కెమెరా 16MP ఉంది. ఇక ఈ ఫోన్ 6 Gen 4 Processorతో ర‌న్ అవుతుంది.

POCO M7 Plus 5G :

రూ.POCO M7 Plus 5G ఫోన్ రూ.12,999ల‌కే వ‌స్తుంది. ఇందులో 6 GB RAM, 128 GB ROM ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఉంది. ఇందులో 6.9 ఇంచుల‌తో పొడ‌వాటి డిస్ ప్లే ఉంది. అంతేకాకుండా 50MP AI Dual Camera ఉండ‌గా 7000 mAh Battery బ్యాట‌రీ ఉంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 5G Processorతో రన్ అవుతుంది.

Tecno Pova 7 5G :

రూ.15,999ల‌కు Tecno Pova 7 5G అనే ఫోన్ కూడా వ‌స్తుంది. ఇది కొత్త బ్రాండ్ అయినప్ప‌టికీ మంచి ప‌ర్ఫామెన్స్ తో పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఇందులో 8 GB RAM, 256 GB ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఉన్నాయి. 6.78 ఇంచుల‌ Full HD డిస్ ప్లే ఉంది. అంతే కాకుండా 50MP ట్రిపుల్ AI కెమెరా,13MP ఉన్నాయి. దీని బ్యాట‌రీ 6000 mAh కాగా Dimensity 7300 Ultimate Processorతో ఇది ర‌న్ అవుతుంది.

Next Story