- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iOS 26 అప్డేట్‌తో చార్జింగ్ కష్టాలు? యాపిల్ చెప్పిన సమాధానం ఇదే
iphoneలో కొత్తగా తీసుకువచ్చిన iOS 26 అప్డేట్ తో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అప్డేట్ చేసుకున్న తరవాత చార్జింగ్ త్వరగా పూర్తవుతుందని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. అయితే చార్జింగ్ త్వరగా దిగిపోవడంపై యాపిల్ స్పందించింది. ఓ లెటర్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. అప్టేట్ తరవాత కొన్ని మార్పులు సాధారణమే అని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: iphoneలో కొత్తగా తీసుకువచ్చిన iOS 26 అప్డేట్ తో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అప్డేట్ చేసుకున్న తరవాత చార్జింగ్ త్వరగా పూర్తవుతుందని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. అయితే చార్జింగ్ త్వరగా దిగిపోవడంపై యాపిల్ స్పందించింది. ఓ లెటర్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. అప్టేట్ తరవాత కొన్ని మార్పులు సాధారణమే అని పేర్కొంది. iOS 26 అప్డేట్ తరవాత కొంతమంది గంటలోపే బ్యాటరీ 100 శాతం నుండి 79 శాతానికి తగ్గడాన్ని గమనించారని పేర్కొంది.
మరికొందరు బ్యాటరీ ఇది వరకు కంటే చాలా ముందుగా 50 శాతం చార్జింగ్ దిగిపోవడాన్ని గమనించారని తెలిపింది. గతంలో అప్డేట్స్ చేసిన సమయంలోనూ ఇలాంటి సమస్యలు వచ్చాయని పేర్కొంది. బీటా సైకిల్ దాటిన తరవాత ఇది మొదటి ఐఓఎస్ 26 అప్డేట్ అని తెలిపారు. కాబట్టి కొన్ని వైవిధ్యాలు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కొత్త iOS వర్షన్ పనితీరు యూజర్లకు అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇది హార్డ్ వేర్ పై ప్రభావం చూపుతుందని, అదనపు ఒత్తిడి కారణంగా ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతుందని తెలిపారు.






