Bajaj WEGO: 296 Kms రేంజ్ తో ఎల‌క్టిక్ ఆటోలు...ధ‌ర ఎంతంటే ?

by velandi.Saikiran |

296 Kms రేంజ్ తో బజాజ్ ఆటో నుంచి త్రీ-వీలర్ పోర్ట్‌ఫోలియోను WEGO ఆటోను లాంఛ్ చేశారు.

Bajaj WEGO:  296 Kms రేంజ్ తో ఎల‌క్టిక్ ఆటోలు...ధ‌ర ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బ‌జాబ్ కంపెనీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఇండియా వ్యాప్తంగా బ‌జాబ్ కంపెనీ పాతుకు పోయింది. టూ వీల‌ర్ నుంచి హేవీ వెహిక‌ల్స్ వ‌ర‌కు Bajaj నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఇక తాజాగా బజాజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోను Bajaj WEGO బ్రాండ్ పేరుతో రిలీజ్ అయింది. ఇది ఇండియాలోనే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోగా రికార్డు సృష్టించింది. ఈ మేరకు బజాజ్ కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.

బజాజ్ వేగో ఆటో ధర, ఫీచర్స్ ఇవే

బజాజ్ వేగో ( Bajaj WEGO ) పేరుతో రిలీజ్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 296 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 17.7 kwh Lfp బ్యాటరీని అమర్చారు. రూ.3.11 లక్షలకు ఈ ఆటో బేస్ మోడల్ రానుంది. రూ.4.48 లక్షలకు టాప్ మోడల్ ఆటో రానుంది. ఈ ధరలు ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే కావడం గమనార్హం. ఇక ఈ వాహనంపై ఐదు సంవత్సరాల వారంటీ లేదా 1.2 లక్షల కిలో మీటర్ల వరకు కంపెనీ ఫుల్ భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

Next Story