విండోస్ 10 OS లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నేటి నుంచి అప్‌డేట్స్‌ బంద్‌

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 04:11:10  IST  )

వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) బ్యాడ్ న్యూస్ చెప్పింది.

విండోస్ 10 OS లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నేటి నుంచి అప్‌డేట్స్‌ బంద్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ (Windows-10 OS) అప్‌డేట్స్ నేటి నుంచి ఆగిపోనున్నాయి. ఈ పరిణామంతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌, సెక్యూరిటీ ప్యాచ్‌, టెక్నికల్ అసిస్టెన్స్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగదారులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారత్‌లో వాడెక్స్, చిన్న వ్యాపారాలు ఉన్న వారు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌నే ఉపయోగిస్తున్నారు.

కాగా, నేటి నుంచి విండోస్ 10 పీసీలు సాధారణంగా పని చేస్తాయి, కానీ కొత్త సెక్యూరిటీ థ్రెట్‌ (వైరస్‌లు, మాల్‌వేర్)లను అడ్డుకునే పరిస్థితి ఉండదు. విండోస్ 10 చివరి సెక్యూరిటీ అప్‌డేట్ నేడు విడుదల అవుతుండగా.. ఇది నవంబర్ 11 వరకు పీసీలను కాపాడుతుంది. ఇక మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లు (వర్డ్, ఎక్సెల్ వంటివి) విండోస్ 10లో 2028 వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతాయి. అదేవిధంగా ఆఫీస్ 2016, 2019 వంటి పాత వెర్షన్‌లు పూర్తిగా నిలిపివేయబడుతాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులంతా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.

Next Story