- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atal pension yojana: రూ.577 చెల్లిస్తే నెలకు రూ.10వేల పెన్షన్.. ఈ స్కీమ్‌తో లైఫ్ బిందాస్
రిటైర్మెంట్ తరవాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు కేంద్రం పలు పథకాలను తీసుకువచ్చింది. అందులో అటల్ పెన్షన్ యోజన పథకం (Atal pension yojana) కూడా ఒకటి. ఈ పథకంలో భార్య భర్తలు ఇద్దరూ చేరితే నెలకు రూ.10వేల వరకు పెన్షన్ పొందవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ 60ఏళ్లు పైబడిన తరవాత ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇబ్బందులు రాకుండా బయటపడొచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ తరవాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు కేంద్రం పలు పథకాలను తీసుకువచ్చింది. అందులో అటల్ పెన్షన్ యోజన పథకం (Atal pension yojana) కూడా ఒకటి.
ఈ పథకంలో భార్య భర్తలు ఇద్దరూ చేరితే నెలకు రూ.10వేల వరకు పెన్షన్ పొందవచ్చు. గతంలో ఇది రూ.5వేలు ఉండగా ఈ యేడాదే పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని అసంఘటిత రంగంలో పనిచేసేవారికోసం తీసుకువచ్చారు. దీనికి అప్లై చేసుకోవాలంటే 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. చిన్నవయసులోనే అప్లై చేసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉంటుంది.
ప్రీమియం డబ్బులు ప్రతినెలా మీ బ్యాంక్ ఖాతా నుండి ఆటో డెబిట్ అవుతాయి. ఈ పథకంలో చేరే వ్యక్తి 30ఏళ్ల వయసులో నెలకు రూ.577 చెల్లించాలి. 35 ఏళ్ల వయసులో చేరితే నెలకు దాదాపు రూ.902 చెల్లించాలి. ఇలా భార్య భర్తలు ఇద్దరూ ప్రీమియం చెల్లిస్తే వారికి 60ఏళ్లు దాటిన వెంటనే నెలకు రూ.10000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ ప్రీమియం దారుడు మరణిస్తే రావాల్సిన మొత్తం నామినీకి అందుతుంది. ఈ స్కీమ్ కోసం గ్రామంలోని పోస్టాఫీస్ లేదా సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని అప్లై చేసుకోవాలి.






