- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజువల్ ఇంటిలిజెన్స్, వీడియో రికార్డింగ్.. APPLE SMART GLASSES ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే
రేబాన్ మెటా గ్లాసెస్ (RAY-BAN META)కు పోటీగా మార్కెట్‌లోకి ఆపిల్ నుండి కూడా స్మార్ట్ గ్లాసెస్ (APPLE SMART GLASESS) రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆపిల్ గ్లాసెస్ ఫీచర్స్ ఇవేనంటూ టెక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రేబాన్ మెటా గ్లాసెస్ (RAY-BAN META)కు పోటీగా మార్కెట్‌లోకి ఆపిల్ నుండి కూడా స్మార్ట్ గ్లాసెస్ (APPLE SMART GLASESS) రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆపిల్ గ్లాసెస్ ఫీచర్స్ ఇవేనంటూ టెక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల ఆధారంగా.. ఆపిల్ తీసుకురాబోతున్న స్మార్ట్ గ్లాసెస్‌లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నాయి. అంతే కాకుండా అనేక డిజైన్స్‌లో రంగుల్లో ఈ గ్లాసెస్ రాబోతున్నాయి.
అప్ గ్రేడెడ్ సిరి వర్షన్‌తో వీటిని తయారు చేస్తున్నారు. సిరి అప్‌గ్రేడ్ వర్షన్‌తో భాషలను ట్రాన్స్ లేట్ చేయడం, ఏదైనా విషయాన్ని నమోదు చేసుకోవడం, ప్రశ్నలు అడగటం, సంగీతం ప్లే చేయడం, సందేశాలు పంపడం లాంటి పనులు చెప్పవచ్చు. అయితే ఆపిల్ గ్లాసెస్ స్క్రీన్ రే బాన్ మెటా గ్లాసెస్ మాదిరిగా లేకపోయినా ఏఐ ఫీచర్స్ మాత్రం ఉంటాయని తెలుస్తోంది.
యాపిల్ గ్లాసెస్ తో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడటం, మనం చూస్తున్న ప్రదేశాన్ని వివరించడం, వీడియో రికార్డింగ్, జంతువులు, పక్షులు లాంటి వాటిని గుర్తించి వాటి వివరాలు సైతం తెలుసుకునే అవకాశం ఉంటుంది. విజువల్ ఇంటిలిజెన్స్ కోసం ఈ గ్లాసెస్ పనిచేయనున్నాయి. అయితే ఈ గ్లాసెస్ వినియోగించాలి అంటే ఆపిల్ ఫోన్ కూడా ఉండాల్సిందేనట. ప్రస్తుతం ఇవి తయారీ దశలోనే ఉన్నాయని త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆపిల్ డివైజ్ లకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక గ్లాసెస్ కూడా వస్తే ఎలా పనిచేస్తాయో చూడాలి.






