అక్రమ సంబంధాలకూ ఓ యాప్.. హైదరాబాద్ సహా ఈ నగరాల్లోనే ఎక్కువమంది యూజర్లు!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-28 07:46:04  IST  )

ప్రస్తుతం అన్ని రకాల సేవలకు యాప్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వాహనాల బుకింగ్ నుండి పెళ్లి సంబంధాలు చూసుకునేవరకు దేనికైనా యాప్స్ ఉన్నాయి. ఇక కొత్త స్నేహితులను చేసుకునేందుకు అయితే లెక్కలేనన్ని యాప్స్ ఉండవచ్చు.

అక్రమ సంబంధాలకూ ఓ యాప్.. హైదరాబాద్ సహా ఈ నగరాల్లోనే ఎక్కువమంది యూజర్లు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అన్ని రకాల సేవలకు యాప్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వాహనాల బుకింగ్ నుండి పెళ్లి సంబంధాలు చూసుకునేవరకు దేనికైనా యాప్స్ ఉన్నాయి. ఇక కొత్త స్నేహితులను చేసుకునేందుకు అయితే లెక్కలేనన్ని యాప్స్ ఉండవచ్చు. వీటితో పాటూ డేటింగ్ యాప్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే డేటింగ్ యాప్స్ అంటే యువతనో లేదా ఎవరైనా డేటింగ్ కల్చర్ పై ఆసక్తి ఉన్నవాళ్ల కోసమో తయారు చేశారు. కానీ అక్రమసంబంధాల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్ ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు.

ఈ యాప్‌ను కూడా మహిళలే తయారు చేయడం విశేషం. ఈ యాప్ యూజర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారట. అక్రమసంబంధాల కోసమే తయారు చేసిన ఈ యాప్ పేరు గ్లీడెన్ కాగా ప్రస్తుతం 10 లక్షల మంది యూజర్లు ఇందులో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ యాప్ వినియోగిస్తున్నారు. ఇక గ్లీడెన్ రీసెంట్‌గా చేసిన సర్వే ప్రకారం ఇండియాలోని బెంగుళూరు, ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, హైదరాబాద్, పూణే నగరాలు ఉన్నాయి. యాప్‌లో మహిళల శాతమే ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. అంతే కాకుండా ఈ సర్వే ప్రకారం డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఇతర సిబ్బంది ఉన్నారు.

Next Story