Whatsapp: వాట్సాప్‌లో మరో అప్ డేట్.. ఇకపై అన్ని గ్రూప్స్‌లోనూ ఆ ఫీచర్

by Yella Dhawani Reddy |

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు చెందిన వాట్సాప్‌ యూజర్ల కోసం మరో అప్‌డేట్‌ను అందిస్తోంది.

Whatsapp: వాట్సాప్‌లో మరో అప్ డేట్.. ఇకపై అన్ని గ్రూప్స్‌లోనూ ఆ ఫీచర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన వాట్సాప్‌ (Whatsapp) యూజర్ల కోసం మరో అప్‌డేట్‌ను అందిస్తోంది. వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్‌ (Voice chat feature) గురించి ఈ యాప్ వినియోగించే వారికి తెలిసే ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు పలు ప్రధాన గ్రూపుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, తాజాగా ఈ వాయిస్ చాట్ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.

ఈ ఫీచర్ గ్రూప్ కాల్ లాగానే పనిచేస్తుంది. అయితే, ప్రతి సభ్యుడిని ఒక్కొక్కరికి రింగ్ చేయడాన్ని నివారిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గ్రూపు కాల్ వచ్చినా రింగ్‌టోన్ రాదు. బదులుగా, ఇది ఇన్-చాట్ పాప్-అప్ నోటిఫికేషన్‌ను ప్రదర్శిస్తుంది. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇలాంటి గ్రూపు కాల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ తరహా ఇబ్బందులను నివారించేందుకు వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ రిలీజ్ చేసింది. అలాగే, వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా గ్రూపు కాల్‌ ఎండ్ అయ్యేలోగా ఏ సమయంలోనైనా ఈజీగా జాయిన్‌ అవ్వొచ్చు.

Next Story