WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై అలా చేయనక్కర్లేదు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-09 12:59:41  IST  )

నచ్చిన ఫొటోలను, వీడియోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటుంటారు. అయితే, ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఫొటోలు స్టేటస్ పెట్టుకోవాలనిపించినప్పుడు స్టేటస్‌ను ఒక్కోటిగా అప్‌డేట్‌ చేయాల్సిందే.

WhatsApp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై అలా చేయనక్కర్లేదు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మోటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను (New Feature) అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇంతకీ కొత్త ఫీచర్ ఏంటంటే?

వాట్సాప్ స్టేటస్ గురించి అందరికీ తెలిసిందే. నచ్చిన ఫొటోలను, వీడియోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటుంటారు. అయితే, ఇందులో ఒకటి కంటే ఎక్కువ ఫొటోలు స్టేటస్ పెట్టుకోవాలనిపించినప్పుడు స్టేటస్‌ను ఒక్కోటిగా అప్‌డేట్‌ చేయాల్సిందే. లేదా వేరే యాప్స్‌లో ఎడిట్ చేసి ఒకచోట చేర్చి, ఆపై స్టేటస్ పెట్టుకోవాల్సి వస్తుంది. రాబోయే కొత్త ఫీచర్‌తో ఆ ఇబ్బంది ఉండదు. వాట్సాప్‌లోనే ఫొటోలను కొలేజ్‌ రూపొందించుకునేందుకు బిల్ట్‌-ఇన్‌ ఎడిటర్‌ ఆప్షన్‌ను అందించనుంది. ఈ ఫీచర్‌తో ఒకేసారి ఆరు ఫొటోలను ఎంపిక చేసుకోని, నచ్చిన కొలేజ్‌ రూపొందించుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పటికే కొందరికీ అందుబాటులోకి రాగా.. మిగిలిన వారికి త్వరలో రానుంది.

Next Story