GST Effect: రూ.10 వేలలోపే స్మార్ట్ ఫోన్లు..ఫీచ‌ర్స్‌, ధ‌ర‌లు ఇవే!

by velandi.Saikiran |

10,000 కంటే తక్కువగా ఉన్న ఐదు స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందులో మొదటగా శాంసంగ్ గెలాక్సీ F06 5G

GST Effect: రూ.10 వేలలోపే స్మార్ట్ ఫోన్లు..ఫీచ‌ర్స్‌, ధ‌ర‌లు ఇవే!
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్ లో ప్రస్తుతం డిస్కౌంట్ మేళా కొనసాగుతోంది. జీఎస్టీ తగ్గింపు అలాగే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు ఆఫర్లు ఇస్తున్న నేపథ్యంలో.. జనాలు ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ పై రకరకాల ఆఫర్లు కొనసాగుతున్నాయి. జీఎస్టీ తగ్గింపు తో పాటు... అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్ల కారణంగా.. తక్కువ ధరకే మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో 10,000 కంటే తక్కువగా ఉన్న ఐదు స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందులో మొదటగా శాంసంగ్ గెలాక్సీ F06 5G మొబైల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 mah. Red me A4 5G మొబైల్ కూడా తక్కువ ధరకు లభిస్తోంది.

6.88 అంగుళాలు ఉన్న ఈ మొబైల్ ఫోన్ 7500కు అమెజాన్ లో అదే సమయంలో ఫ్లిప్కార్ట్ లో 8000 రూపాయలకు అందిస్తున్నారు. లావా బోల్టు N1 ప్రో మొబైల్ 6599 రూపాయలకు అమెజాన్ లో వస్తోంది. ఫ్లిప్కార్ట్ లో దీని ధర ఎనిమిది వేల వరకు ఉంది. పోకో M7 మొబైల్ ఫోన్ అమెజాన్ లో 8500 రూపాయలకు వస్తోంది. ఇక వివో T4 లైట్ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో 6500 కు అలాగే ఫ్లిప్కార్ట్ లో 8000 రూపాయలకు వస్తుంది.

Next Story