ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 వెర్షన్ విడుదల

by Disha Web Desk 17 |
ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 వెర్షన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ కొత్తగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్ 13 కు అప్‌గ్రేడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14 డెవలపర్ ప్రివ్యూను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇది మెరుగైన ఇంటర్‌ఫేస్ స్పీడ్, పవర్-డ్రా ఆప్టిమైజేషన్‌లు, అలాగే సెక్యూరిటీ, ప్రైవసీ అప్‌గ్రేడ్‌లతో సహా అనేక అప్‌డేట్‌లు, సరికొత్త ఫీచర్లను అందించింది. ముఖ్యంగా నాన్-లీనియర్ స్కేలింగ్‌తో పెద్ద ఫాంట్‌లను, బ్యాక్‌గ్రౌండ్‌లోని యాప్‌ల ద్వారా బ్యాటరీ వాడకాన్ని తగ్గించే ఫీచర్‌ను అందించింది. అంతేకాకుండా అప్‌డేట్ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు తక్కువ బ్యాక్‌గ్రౌండ్ పవర్‌ని ఉపయోగించడానికి యాప్‌లను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఇది Pixel 6 సిరీస్, Pixel 7 సిరీస్, Pixel 5, Pixel 5a, Pixel 4aతో సహా ఇతర Pixel స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.


Next Story

Most Viewed