ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద

by Muthe.Rajitha |

అంతరిక్ష కేంద్రం(Space Station)లో అలసంద విత్తనాలు(Alasanda Seeds) మొలకెత్తాయి.

ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద
X

దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్ష కేంద్రం(Space Station)లో అలసంద విత్తనాలు(Alasanda Seeds) మొలకెత్తాయి. స్పెడెక్స్ మిషన్లో(Spedex Mission) భాగంగా అతరిక్షంలోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్(CROPS) అనే పేలోడ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో ఉంచిన అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ పేలోడ్ ను ఇస్రో(ISRO)కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(Vikram Sarabhai Space Station) అభివృద్ధి చేసింది. దీనిపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. 'అంతరిక్షంలో జీవం మొలకెత్తింది.. త్వరలోనే పత్రాలు వస్తాయి' అంటూ ఇస్రో తన ఎక్స్(X) ఖాతా వేదికగా ట్వీట్ చేసింది. ఇది సక్సెస్ అయితే అంతరిక్షంలో పంటలు పండించడంపై భారీ పురోగతి ఏర్పడినట్టే అని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story