- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ రంగంలో ఏఐ టెక్నాలజీ.. ఇక రైతులకు నో టెన్షన్!
ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ కూలీల కొరత విపరీతంగా పెరిగిపోతుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ కూలీల కొరత విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు, రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలోకీ (Agricultural sector) ఆధునిక పోకడలు వచ్చి చేరుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మల్టీపర్పస్ రోబోను (Multipurpose robot) తయారు చేస్తోది అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’ (Agritech startup 'X Machines'). ఈ రోబో దున్నడం, విత్తనాలు వెదజల్లడం, కలుపుతీత వంటి అనేక పనులు చేస్తోంది. దీంతో రైతులకు కూలీల సమస్య, పెట్టుబడి ఖర్చులు తగ్గనున్నాయి.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ హైదరాబాద్, బిరాక్‌లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఏఐపీ బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా ఎక్స్ మెషిన్స్ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఏఐ బేస్డ్ రోబోలను రూపొందిస్తోంది.
ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగు మందుల పిచికారీలు అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఈ రోబోలు ఏఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం వీటి ప్రత్యేకత అని చెబుతున్నారు. అలాగే, ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుందని తెలిపారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఏఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.






