- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔషధ రంగంలోకి ఏఐ.. భారత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు మొదలైంది!
ప్రస్తుతం ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో కొత్త శకానికి నాంది పలుకుతోంది. ముఖ్యంగా బయోటెక్నాలజీ రంగంలో AI వినియోగం ఔషధ పరిశోధనలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతూ, సమగ్ర వైద్యం దిశగా మార్గనిర్దేశం చేస్తోంది. దీంతో ఒకప్పుడు సంవత్సరాల పాటు సాగే ఔషధ అభివృద్ధి ప్రక్రియలు ఇప్పుడు AI టెక్నాలజీ ద్వారా కొన్ని నెలల్లోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల భారత బయోటెక్ కంపెనీలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అంతేకాదు సమకాలీన జన్యుపరిశీలనలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. జన్యు విశ్లేషణలో ఏఐ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడుతూ లక్షలాది జన్యు సంకేతాలను వేగంగా విశ్లేషించి, వ్యాధులకు కారణమయ్యే మార్పులను గుర్తించడంలో AI అపూర్వ ప్రతిభ చూపుతోంది. దీంతో ఒక వ్యక్తి జీన్స్‌లో జన్యు మార్పులను గుర్తించి, ప్రత్యేకంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకునే ఔషధాలను రూపొందించడం ఇప్పుడు సాధ్యం అవుతోంది. దీనిని 'పర్సనలైజ్డ్ మెడిసిన్ (Personalized Medicine)' గా పిలుస్తున్నారు.
ఇక ఈ తరహా ఔషధ తయారీ పరిశోధనలో హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్, బెంగళూరులోని బయోకాన్, ముంబైలోని న్యూ జెన్ లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థలు, అమెరికా FDA వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు కలుపుకుంటూ, గ్లోబల్ మార్కెట్‌లో తమ ప్రాభవాన్ని పెంచుకుంటున్నాయి. ఇక 2030 నాటికి భారత బయోటెక్ రంగం 150 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రపంచ బయోటెక్ మార్కెట్ 2 ట్రిలియన్ డాలర్లకు చేరే ఛాన్సుందని చెబుతున్నారు. అలాగే ఈ అభివృద్ధి భారతదేశాన్ని 'జన్యు ఆధారిత వ్యక్తిగత వైద్యం' రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలిపే అవకాశాలను పెంచుతోందని అంటున్నారు.






