ఏఐ ఆధారిత రైల్వే సేవల అసిస్టెంట్.. ఇక అన్నీ సమస్యలకి ఆస్క్ దిశా 2.0 పరిష్కారం!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-31 06:52:40  IST  )

మన దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగానికి వెళ్లే వారు, విద్యార్థులు, వ్యాపారస్తులు, విహారయాత్రలకు వెళ్లే కుటుంబాలు ఇలా

ఏఐ ఆధారిత రైల్వే సేవల అసిస్టెంట్.. ఇక అన్నీ సమస్యలకి ఆస్క్ దిశా 2.0 పరిష్కారం!
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగానికి వెళ్లే వారు, విద్యార్థులు, వ్యాపారస్తులు, విహారయాత్రలకు వెళ్లే కుటుంబాలు ఇలా ఎన్నో వర్గాల ప్రజలు రైల్వే సేవలపై ఆధారపడి ఉంటారు. ఈ విస్తృత ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, భారతీయ రైల్వే శాఖ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ద్వారా టికెట్ బుకింగ్, క్యాటరింగ్, టూరిజం వంటి అనేక సేవలను అందిస్తోంది. ఈ సేవలు ప్రయాణికులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, మరింత సౌకర్యవంతంగా ఉండేలా సహాయపడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రిఫండ్ లాంటి అంశాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యలకు సమాధానంగా, ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఐఆర్‌సీటీసీ తాజాగా ఏఐ (Artificial Intelligence) ఆధారిత వర్చువల్ అసిస్టెంట్.. 'ఆస్క్ దిశా 2.0 (AskDISHA 2.0)'ను పరిచయం చేసింది. ఇది ప్రయాణికులకు తక్కువ సమయంలో, తక్కువ కష్టంతో రైల్వే సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. ఇక ఈ ఆస్క్‌ దిశా 2.0 చాట్‌బాట్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. వాయిస్‌ కమాండ్ల సాయంతోనూ కావాల్సిన సమాచారం అందించడం దీని ప్రత్యేకత. ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ వంటి భాషలకు ఈ వాయిస్‌ కమాండ్‌ సపోర్ట్‌ చేస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ లేకుండా ఓటీపీ సాయంతో టికెట్‌ పొందే సదుపాయం ఉంది. క్యాన్సిలేషన్‌ లేదా ఫెయిల్‌ ట్రాన్సాక్షన్లకు క్విక్‌ రిఫండ్‌ పొందేందుకు ఇది సాయపడుతుంది. భవిష్యత్తులో వేగవంతమైన బుకింగ్‌ల కోసం ప్రయాణికుల వివరాల్ని సేవ్‌ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

* బ్రౌజర్‌లో Ask DISHA 2.0 అని టైప్‌ చేయాలి.

* కనిపించే లింక్‌పై క్లిక్ చేస్తే, దానికి సంబంధించిన వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.

* అందులో కిందనే సెర్చ్‌బార్‌, వాయిస్ కమాండ్స్‌ ఇచ్చేందుకు మైక్‌ ఐకాన్‌ ఉంటుంది.

* సెర్చ్‌ బార్‌లో వాయిస్‌ అలాగే స్క్రోల్ చేస్తే రిఫండ్ స్టేటస్‌, క్యాన్సిల్ టికెట్‌, పీఎన్‌ఆర్ స్టేటస్‌, బుకింగ్ హిస్టరీ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

* వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్లు ఎంచుకుని సింగిల్‌ క్లిక్‌తో యాక్సెస్‌ చేయొచ్చు.

Next Story