- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇకపై వారి అకౌంట్స్ పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి!
ప్రముఖ సోషల్ మీడియా (Social media) యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల గోప్యతకు సంబంధించి ఎప్పటికప్పుడు భద్రతపరమైన చర్యలు తీసుకునే ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా (Social media) యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల గోప్యతకు సంబంధించి ఎప్పటికప్పుడు భద్రతపరమైన చర్యలు తీసుకునే ఉంటుంది. ఇందులో భాగంగా 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వాడకాన్ని నియంత్రించే అధికారాన్ని తల్లిదండ్రులకు కల్పించింది. ఇటీవల కాలంలో పిల్లల జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో మెటా సంస్థ ఇన్‌స్టా టీన్ అకౌంట్స్‌ను (Instagram Teen Accounts) తీసుకొచ్చింది. తొలుత ఈ ఇన్‌స్టా టీన్ సేవల్ని అమెరికా, యూకే, వంటి దేశాల్లో అందుబాటులోకి తెచ్చిన మెటా.. తాజాగా భారత్‌లోనూ ప్రారంభించింది.
ఈ ఇన్‌స్టా టీన్ అకౌంట్స్ డిఫాల్ట్‌గా ప్రైవేట్‌లోకి వెళతాయి. అంటే.. తమ ఫాలోవర్స్‌ను మాన్యువల్‌గా ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఖాతాల ఉన్నవారు ఇప్పటికే ఫాలో/ కనెక్ట్ అయిన ఖాతాల నుంచి మాత్రమే మెసేజ్‌లు, ట్యాగ్‌లు చేయగలరు. ఇక ఈ అకౌంట్స్‌కి సెన్సిటివ్ కంటెంట్‌పై పూర్తిగా నియంత్రణ ఉంటుంది. చూపించే ఫీడ్, డైరెక్ట్ మెసేజ్‌లు, కామెంట్లలో అసభ్య పదజాలాన్ని ఇన్‌స్టా ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేస్తుంది. అలాగే, రోజులో యాప్ వాడకం 60 నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్ వస్తుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లేవీ రావు. పైగా మెసేజులకు డైరెక్ట్ ఆటో రిప్లయ్స్ వెళ్తాయి. ఈ నియమం 18 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుంది. కొత్తగా ఇన్‌స్టా ఖాతా తెరిచే వారికి, ఇప్పటికే ఉన్న వారికీ టీన్ అకౌంట్ నిబంధనలు వర్తిస్తాయి. ఇక 16 ఏళ్లలోపు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీనివల్ల పిల్లలు వాడే ఇన్‌స్టా ఖాతాపై తల్లిదండ్రుల నిఘా సాధ్యమవుతుందని మెటా పేర్కొంది.






