ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే జాకెట్.. ఇకపై నో టెన్షన్!

by Yella Dhawani Reddy |

ఆధునిక యుగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే జాకెట్.. ఇకపై నో టెన్షన్!
X

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక యుగంలో టెక్నాలజీ (Technology) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక ప్రస్తుతం సాంకేతికత మన జీవనశైలిలో అనేక మార్పులను తీసుకువస్తోంది. రోజువారి పనుల నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు టెక్నాలజీ మనకు సౌలభ్యం, భద్రత కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో వినూత్న ఆవిష్కరణ రూపుదిద్దుకుంది. ఇది ప్రమాదాల్లో పడే సమయంలో మనిషి ప్రాణాలకు రక్షణ నిలిచేందుకు ఉపయోగపడుతుంది.

సాధారణంగా కార్లలో ఉండే ఎయిర్ బ్యాగుల గురించి ప్రతి ఒక్కరి తెలిసే ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనప్పుడూ వెంటనే ఎయిర్ బ్యాగులు (Air Bags) ఓపెన్ అయి మనకు రక్షణంగా నిలుస్తాయి. అచ్చం అలాగే, మనం కింద పడిపోబోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం గాయాల బారిన పడకుండా ఎయిర్ బ్యాగ్ జాకెట్‌ను (Air Bag Jocket) రూపొందించారు. దీన్ని ముఖ్యంగా వృద్ధులు, బైక్‌ రైడర్లు, కూలీలు వంటివారికి ఉపయోగపడేలా రూపొందించారు. ఈ జాకెట్‌లో గల సెన్సార్లు, మైక్రోచిప్‌లు శరీర కదలికలను గమనించి, ప్రమాద సూచనలను గుర్తిస్తాయి. వ్యక్తి తూలి పడిపోతున్న సందర్భంలో కేవలం 0.1 సెకన్లలో ఈ జాకెట్ ఓపెన్ అవుతుంది. ఇది గాలి నింపిన కవచంలా మారి, నడుము, భుజాలు, తల వంటి ప్రాముఖ్యమైన అవయవాలను కాపాడుతుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు విజయవంతంగా వాడుతున్నాయి. ఇక త్వరలోనే భారతదేశంలో కూడా ఈ స్మార్ట్ భద్రతా పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.

Next Story