- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం.. 6లక్షల మంది కార్మికుల ఉద్యోగాలకు కోత
ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఏఐ శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఏ పనిచేసేందుకు అయినా ఏఐని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని పనులకు ఏఐ ఆధారంగా పనిచేసే రోబోటిక్స్ వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఏఐ శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఏ పనిచేసేందుకు అయినా ఏఐని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని పనులకు ఏఐ ఆధారంగా పనిచేసే రోబోటిక్స్ వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేసింది. ఇక టెక్ దిగ్గజం అమెజాన్ తమ కంపెనీలో ఏకంగా 6లక్షల కార్మిక ఉద్యోగాల్లో రోబోటిక్స్‌నే నియమించుకోవాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.
వాటి ప్రకారం, అమెజాన్ 2033 నాటికి అమెరికాలో 6లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను రోబోలతోనే భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. తమ కంపెనీ కార్యకలాపాల్లో 75శాతం ఉద్యోగాలను 2027 నాటికి ఆటోమేషన్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ గోదాంలు, షిప్పింగ్ కేంద్రాలలో రోబోలను తీసుకురావడం ద్వారా 2025 నుండి 2027 వరకు దాదాపు 12.6 బిలియన్లను ఆదా చేసుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే అమెజాన్‌లో భారీగా లే ఆఫ్స్ జరిగిన సంగతి తెలిసిందే. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్‌లో భారీగా ఉద్యోగాల కోత తప్పదని నిపుణులు చెబుతున్నారు.






