న‌వంబ‌ర్ లో రాబోయే 5 అదిరిపోయే ఫోన్లు ఇవే..ఫీచ‌ర్స్ చూస్తే !

by velandi.Saikiran |

వివో ఎక్స్ 300 ప్రో ( vivo X300 Pro 5G ) నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి

న‌వంబ‌ర్ లో రాబోయే 5 అదిరిపోయే ఫోన్లు ఇవే..ఫీచ‌ర్స్ చూస్తే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన భారతదేశంలో రకరకాల మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కొత్త మొబైల్స్ వస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల ఫోన్స్ లాంఛ్ కాగా.. నవంబర్ మాసంలో మరో ఐదు కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. వివో ఎక్స్ 300 ప్రో ( vivo X300 Pro 5G ) నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ ఫోన్ కు 50 మెగా ఫిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 6510 ఎంఏహెచ్ ఉంటుంది.

రియల్ మీ జీటీ 8 ప్రో ( Realme GT 8 Pro) మొబైల్ కూడా నవంబర్ లో రానుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో కలిగి ఉన్న ఈ మొబైల్ ఫోన్ కు 50 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌ అందిస్తున్నారు. ఒప్పో find ఎక్స్ 9 ప్రో ఫోన్ కూడా వచ్చే నెలలో రానుంది. 6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ కు 7500 బ్యాటరీ అందిస్తున్నారు. వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్ వచ్చే నెలలో రాబోతుంది. వన్ ప్లస్ 15 పేరుతో ఇండియన్ మార్కెట్ లో వచ్చేనెల కొత్త ఫోన్ రానుంది. చైనాలో రేపు అక్టోబర్ 27వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది.

6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. 50 MP ప్రధాన కెమెరా కూడా అందిస్తున్నారు. 165HZ రిఫ్రెష్ రేట్ తో ఈ మొబైల్ రానుంది. ఐక్యూ 15 కూడా వచ్చే నెలలోనే లాంచ్ కాబోతుంది. 6.85 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ , 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 100w వైర్డ్,40 w వైర్లెస్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కు కూడా 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. పైన పేర్కొన్న మొబైల్ ఫోన్ల ధర వివరాలు నవంబర్లో రివిల్ కాబోతున్నాయి.

Next Story