Raksha Bandhan 2025: మీ బడ్జెట్ లోనే 5 మొబైల్స్..రక్షా బంధన్ కు గిఫ్ట్ ఇచ్చేయండి !

by velandi.Saikiran |

మోటోరోలో ఎడ్జ్ 60 ( Motorola Edge 60) మొబైల్ ఫోన్ బడ్జెట్ లోనే ఉంటుంది. ఇది 6.67 ఇంచుల డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది.

Raksha Bandhan 2025: మీ బడ్జెట్ లోనే 5 మొబైల్స్..రక్షా బంధన్ కు గిఫ్ట్ ఇచ్చేయండి !
X

దిశ, వెబ్ డెస్క్: రక్షాబంధన్ ( Raksha Bandhan 2025) వచ్చేసింది. ఈ పండగ రాగానే.. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు.. పుట్టింటికి వెళ్తారు ఆడపడుచులు. ఈ నేపథ్యంలోనే రాఖీలు కట్టిన అనంతరం.. తమ సోదరీమణులకు ప్రత్యేక గిఫ్ట్ లు ఇస్తారు సోదరులు. ఇందులో కొంతమంది డబ్బులు కట్నం గా ఇస్తే.. మరి కొంతమంది మొబైల్ ఫోన్స్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు. అయితే అలా మొబైల్ ఫోన్స్ బడ్జెట్ లో గిఫ్టుగా ఇవ్వాలనుకునే వారికోసం.. ప్రత్యేక ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

మోటోరోలో ఎడ్జ్ 60 ( Motorola Edge 60) మొబైల్ ఫోన్ బడ్జెట్ లోనే ఉంటుంది. ఇది 6.67 ఇంచుల డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. 32mp సెల్ఫీ కెమెరా ఉంటే అలాగే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సల్ ఉంటుంది. ఈ మొబైల్ ధర 23,000 గా ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మరో మొబైల్ వివో T4. ప్రస్తుతం ఈ మొబైల్ సేల్స్ బాగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో సెల్ఫీల కోసం 32 ఎంపీ, బ్యాక్ కెమెరా 50 mp కెమెరా ఉంది. ఇక ఈ మొబైల్ ధర 22,000గా ఉంది.

వన్ ప్లస్ నార్డ్ CE 5 ( OnePlus Nord CE ) మొబైల్ కూడా బడ్జెట్ లోనే మనకు వస్తుంది. ఈ మొబైల్ ధర 24 వేల రూపాయలుగా ఉంది. ఇందులో సెల్ఫీల కోసం.. 16 మెగాపిక్సల్ అందిస్తున్నారు. అలాగే బ్యాక్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. నథింగ్ ఫోన్ 3a మొబైల్ ధర 25 వేల రూపాయలు గా ఉంది. దీని ఫ్రంట్ కెమెరా 32 మెగా ఫిక్సల్ కాగా బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సెల్ గా ఉంటుంది. రాఖీలు కట్టే సోదరీమణులకు కెమెరా బాగుంటే.. ఇష్టపడతారు. కాబట్టి పైన పేర్కొన్న ఫోన్లు గిఫ్ట్ గా ఇస్తే.. కచ్చితంగా వాళ్ళు సంతోషపడతారు. ఇక ఈ మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక క్రెడిట్ కార్డులు వాడితే మరింత డిస్కౌంట్ వస్తుంది.

Next Story