Google Pixel 9 Pro XLపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.25వేలు తగ్గిన ఫోన్ ధర

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో పలు బ్రాండ్ ఫోన్ల ధరలపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సేల్ లో గూగుల్ పిక్స‌ల్ 9 ప్రో XLపై సైతం డిస్కౌంట్ ప్ర‌క‌టించారు.

Google Pixel 9 Pro XLపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.25వేలు తగ్గిన ఫోన్ ధర
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో పలు బ్రాండ్ ఫోన్ల ధరలపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సేల్ లో గూగుల్ పిక్స‌ల్ 9 ప్రో XLపై సైతం డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. ఈ ఫోన్ 256జీబీ ఇంట‌ర్న‌ల్,16GB RAM వేరియంట్ లాంచింగ్ ధ‌ర రూ.1,14,999 ఉండ‌గా ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఏకంగా రూ.25,000 డిస్కౌంట్ ఉంది. దీంతో రూ.89,999లకే ఈ ఫోన్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ, క్రెడిట్ కార్డుల డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి.

ఇక ఈ ఫోన్ మూడు వేరు వేరు రంగుల్లో లభిస్తుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే 6.8 అంగుళాల LTPO OLED డిస్ ప్లేను కలిగి ఉంది. దీంతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వేగవంతంగా పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో ఫోన్ ప్యానెల్ డబుల్ సెక్యురిటీని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

వీటితో పాటు ఈ మొబైల్ లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగాపిక్సల్ ప్రైమరీ షూటర్, 5x ఆప్టికల్ జూమ్ తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ మరియు 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కెమెరాలు ఉన్నాయి. దీనిలో 42 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సైతం ఇవ్వడంతో సెల్ఫీలు కూడా ఫుల్ క్లారిటీతో తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 37W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5060mAh బ్యాటరీ ఉంది

Next Story