గణనీయంగా లబ్ధి పొందిన టెక్ మహీంద్రా

by  |
గణనీయంగా లబ్ధి పొందిన టెక్ మహీంద్రా
X

ముంబయి: టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా సూచీలు మంగళవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో 5.7శాతం లాభపడి షేర్ విలువ రూ.702.40‌కు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి నికర లాభం రూ.972.3కోట్లుగా టెక్ మహీంద్రా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 20.95శాతం అత్యధికం కావడం గమనార్హం. ఈ ఫలితాల ప్రభావం ట్రేడింగ్ ప్రారంభంగానే స్పష్టంగా కనిపించింది. ఉదయం 9.30గంటలకు టెక్ మహీంద్రా షేర్ విలువ 5.2శాతం పెరిగి రూ. 698.8 వద్ద ట్రేడయ్యింది.

దేశంలో ఐదో పెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.9,103కోట్లుగా ప్రకటించింది. ఇది అంతకుముందు మార్చి 31తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 4.5శాతం తక్కువ.

సోమవారం త్రైమాసిక ఫలితాలు వెలువడిన వెంటనే టెక్ మహీంద్రా షేర్ 1.73శాతం లాభపడి రూ.664.05కు చేరుకున్నది. ఆ లాభాలను మంగళవారం కూడా కొనసాగించింది. మొత్తం రెండు సెషన్లలో కలిపి టెక్ మహీంద్రా షేర్ విలువ 8శాతం లాభపడింది.
Next Story

Most Viewed