సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్

by  |
KL Rahul
X

దిశ, వెబ్‌డెస్క్: పుణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. దూకుడుగా ఆడి అదిరిపోయే సెంచరీ చేశాడు. 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేశాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైనా వన్డేల్లో జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రాహుల్. తొలి వన్డేలో అర్థసెంచరీతో అజేయంగా నిలిచిన రాహుల్ ఈ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. కాగా, వన్డేల్లో రాహుల్‌కు ఇది ఐదో సెంచరీ. ప్రస్తుతం టీమిండియా.. 44.5 ఓవర్లలో 271 పరుగులు చేసింది.

https://twitter.com/ICC/status/1375404454569070594?s=20

Next Story

Most Viewed