- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్‌లో ఆ రెండు జట్లే ఫేవరెట్లు
<p>దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్లే హాట్ ఫేవరెట్లని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ అన్నారు. యువకులు, సీనియర్లతో కోహ్లీ సేన సమతూకంగా ఉండగా.. వెస్టిండీస్ టీమ్‌లో అయితే అందరూ స్టార్లే అని కరీమ్ అన్నాడు. ఇక ఈ రెండు జట్లు కాకుండా ఇంగ్లాండ్ జట్టు కూడా గట్టి పోటీదారుగా ఉండబోతోందని ఆయన జోస్యం చెప్పాడు. ‘నా దృష్టిలో వెస్టిండీస్ జట్టే హాట్ […]</p>

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్లే హాట్ ఫేవరెట్లని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ అన్నారు. యువకులు, సీనియర్లతో కోహ్లీ సేన సమతూకంగా ఉండగా.. వెస్టిండీస్ టీమ్‌లో అయితే అందరూ స్టార్లే అని కరీమ్ అన్నాడు. ఇక ఈ రెండు జట్లు కాకుండా ఇంగ్లాండ్ జట్టు కూడా గట్టి పోటీదారుగా ఉండబోతోందని ఆయన జోస్యం చెప్పాడు. ‘నా దృష్టిలో వెస్టిండీస్ జట్టే హాట్ ఫేవరెట్. ఇక రెండో స్థానంలో టీమ్ ఇండియా ఉన్నది. కరేబియన్ జట్టును పరిశీలిస్తే అందరూ భారీ షాట్లు దంచి కొట్ట గలిగే స్టార్లే కనపడుతున్నారు.
ఐపీఎల్‌లో కూడా వాళ్లు అత్యద్భుతంగా రాణిస్తున్నారు. ఇక టీమ్ ఇండియా అనుభవం, యువకులతో కలిగి సమతూకంగా కనపడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లాండ్ మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నాను’ అని సాబా కరీం చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన కివీస్ జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. వాళ్లు కూడా వరల్డ్ కప్ కోసం మంచి పట్టుదలతో ఉన్నారని మాజీ క్రికెటర్ రితీందర్ సింగ్ అన్నారు.






