ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమ్ ఇండియా

by Shyam |

<p>దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో టెస్టు సిరీస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ ముందస్తు జాగ్రత్తగా కరోనా సోకిన రిషబ్ పంత్, దయానంద్‌ను ఐసోలేషన్‌లో ఉంచి.. కరోనా సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్ చేసింది. వారిన తప్ప మిగతా జట్టును మొత్తం రాత్రికి రాత్రే దుర్హామ్ తరలించింది. అప్పటికే రెండో డోస్ కొవీషీల్డ్ తీసుకున్న టీమ్ ఇండియా సభ్యులు రాత్రి విశ్రాంతి అనంతరం తిరిగి [&hellip;]</p>

team-india 1
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో టెస్టు సిరీస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ ముందస్తు జాగ్రత్తగా కరోనా సోకిన రిషబ్ పంత్, దయానంద్‌ను ఐసోలేషన్‌లో ఉంచి.. కరోనా సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్ చేసింది. వారిన తప్ప మిగతా జట్టును మొత్తం రాత్రికి రాత్రే దుర్హామ్ తరలించింది. అప్పటికే రెండో డోస్ కొవీషీల్డ్ తీసుకున్న టీమ్ ఇండియా సభ్యులు రాత్రి విశ్రాంతి అనంతరం తిరిగి దుర్హామ్ కౌంటీ గ్రౌండ్‌లో సమావేశం అయ్యారు.

తేలిక పాటి వ్యాయామాలతో తమ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ చిత్రాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నది. ఈ నెల 20 నుంచి సెలెక్ట్ కౌంటీ జట్టుతో భారత జట్టు మూడు రోజుల మ్యాచ్‌లో తలపడనున్నది. ఈ రెండు రోజులు భారత జట్టు దుర్హామ్ మైదానంలోనే పూర్తి స్థాయిలో సాధన చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మరోవైపు ఇక నుంచి భారత జట్టు కఠినమైన బయోబబుల్‌లో ఉండనున్నది.

Next Story