- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ ఆఫీసులో టీచర్.. చివరికి..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆయన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. మరో రెండు నెలలు ఉంటే రిటైర్డ్ కాబోతున్నాడు కూడా. అయితే ఆయన ఓ పార్టీ ఆఫీసులో రాజకీయనాయకుడుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఆయన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. మరో రెండు నెలలు ఉంటే రిటైర్డ్ కాబోతున్నాడు కూడా. అయితే ఆయన ఓ పార్టీ ఆఫీసులో రాజకీయనాయకుడుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.
వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఇలా పార్టీ ఆఫీసులకు వెళ్లడంపై వైసీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వరరావు తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.






