- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయుడి గొంతు కోసిన దుండగులు
by Batti.Sumithra |
<p> ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఉపాధ్యాయుడిని ముగ్గురు దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్న రామకృష్ణ స్థానిక ఎంఈవో కార్యాలయంలో సీఆర్సీగా పనిచేస్తున్నాడు. రామకృష్ణ గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చొరబడి అతని గొంతు కోసి దారుణంగా చంపేశారు. అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన అతని భార్యపై దుండగులు దాడులకు తెగబడ్డారు. ఆస్తి […]</p>
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఉపాధ్యాయుడిని ముగ్గురు దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్న రామకృష్ణ స్థానిక ఎంఈవో కార్యాలయంలో సీఆర్సీగా పనిచేస్తున్నాడు. రామకృష్ణ గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు చొరబడి అతని గొంతు కోసి దారుణంగా చంపేశారు. అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన అతని భార్యపై దుండగులు దాడులకు తెగబడ్డారు. ఆస్తి వివాదాలనే ఈ ఘోర ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






