విద్యార్థినిని గోడకేసి కొట్టిన ఉపాధ్యాయుడు

by Batti.Sumithra |

<p>      వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్గి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. 9వ తరగతి చదువుతున్న మహానేని అనే విద్యార్థిని వారం రోజులు స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్ బాలికను గోడకేసి కొట్టాడు. దీంతో బాలిక తల పగిలి.. తీవ్రంగా రక్తం కారడంతో ఎవరికీ తెలియకుండా ఆమెకు వైద్యం చేయించాడు. తోటి విద్యార్థులు కూడా ఎక్కడా చెప్పొద్దని బెదిరించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని [&hellip;]</p>

విద్యార్థినిని గోడకేసి కొట్టిన ఉపాధ్యాయుడు
X

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్గి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. 9వ తరగతి చదువుతున్న మహానేని అనే విద్యార్థిని వారం రోజులు స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన టీచర్ బాలికను గోడకేసి కొట్టాడు. దీంతో బాలిక తల పగిలి.. తీవ్రంగా రక్తం కారడంతో ఎవరికీ తెలియకుండా ఆమెకు వైద్యం చేయించాడు. తోటి విద్యార్థులు కూడా ఎక్కడా చెప్పొద్దని బెదిరించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని విధులు నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story