చెట్టెక్కి పాఠాలు బోధిస్తున్న టీచర్.. ఎక్కడంటే?

by  |
చెట్టెక్కి పాఠాలు బోధిస్తున్న టీచర్.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా కారణంగా పరీక్షలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకోవచ్చని ప్రభుత్వం కూడా తెలిపింది. దాంతో చాలా పాఠశాలలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి కూడా. కంప్యూటర్ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని మూరుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఉన్న సిగ్నల్ సరిగ్గా అందడం లేదు. దాంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ హిస్టరీ టీచర్‌కు ఇలాంటి ఇబ్బందే రావడంతో… ఊరికి దూరంగా ఉన్న చెట్టు‌పై ఎక్కి పిల్లలకు పాఠాలు బోధిస్తూ .. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పశ్చిమ బెంగాల్‌లోని అహండా గ్రామానికి చెందిన సుబ్రతా పాటి.. హిస్టరీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ వేళ.. సుబ్రతా పనిచేసే స్కూలు యాజమాన్యం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. దీంతో సుబ్రతా కూడా అందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ ఉపాధ్యాయుడి ఇంట్లో సరిగా సిగ్నల్ రాకపోవడంతో తన ఇంటికి సమీపంలోని ఒక వేపచెట్టునే తన క్లాస్‌రూంగా మార్చుకున్నాడు. ఆ చెట్టుపై ఇంటర్నెట్ కాస్త మెరుగ్గా వస్తుండటంతో తానే స్వయంగా ఆ చెట్టుపై ఓ వుడెన్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. టిఫిన్‌బాక్స్, వాటర్ తీసుకుని రోజు ఉదయాన్నే ఆ చెట్టు వద్దకు చేరుకుంటాడు. రెండు, మూడు క్లాసులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఎండలు బాగా ఉండటంతోపాటు, వేడి గాలుల వీస్తున్న కారణంగా చెట్టుపై కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నప్పటికీ.. విద్యార్థులకు ఇబ్బంది కలగవద్దని తాను ఈ పని చేస్తున్నానని అతను చెప్పాడు. ‘విద్యార్థులు కూడా నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నారు. నాకు ఎప్పుడూ వారు మద్దతుగా ఉంటారు. నేను ఇంత కష్టపడి పాఠాలు చెబుతున్నందుకు నా సబ్జెక్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటామని వాళ్లు హామీ ఇచ్చారు’ అని ఆ ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు.

సుబ్రతా పాటి సార్ క్లాస్ మిస్ కాను….

‘నేను సుబ్రతా పాటి సార్ క్లాస్ అస్సలు మిస్ కాను. నా స్నేహితులు కూడు సార్ క్లాస్‌కు తప్పకుండా వస్తారు. ప్రతిరోజు సార్ క్లాస్‌కు 90 శాతంపైనే అటెండెన్స్ ఉంటుంది. అంతేకాదు మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ తీరుస్తారు’ అని ఓ విద్యార్థి తెలిపాడు. పాటిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, తన మొదటి నుంచి చాలా హార్డ్వర్క్ చేసేవాడని అడామస్ యూనివర్సిటీ చాన్సెలర్ సమిత్ రే తెలిపారు.

Tags: teacher, tree, internet hurdle, lessons, online class, history teacher , subrata pathi


Next Story

Most Viewed